ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా కృష్ణారావు
ఖమ్మంమామిళ్లగూడెం: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా డాక్టర్ కేవీ కృష్ణారావు నియమితులయ్యారు. అలాగే, ఉమ్మ డి జిల్లా చైర్మన్‌గా పుసుపులేటి నాసరయ్యను నియమిస్తూ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ ఒక ప్రక్రటన విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు, నాసరయ్య మాట్లాడుతూ.. ఉద్యమకారుల హక్కుల సాధనతో పాటు వారి సంక్షేమ అవసరాల కోసం పాటుపడతామని తెలిపారు.
ఆర్చరీ ఎంపిక పోటీలకు ట్రయల్స్
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాస్థాయి ఆర్చ రీ మినీ అండర్–15, 13, 10 విభాగాల్లో బాలు రు, బాలికల ఎంపికకు ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ బాధ్యులు సాధుల సారంగపాణి, పుట్టా శంకరయ్య తెలి పారు. పాల్వంచ మండలం కిన్నెరసానిలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో ఆదివారం ఉదయం 8 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.కన్వీనర్లుగా స్పోర్ట్స్ స్కూల్ హెచ్ ఎం బి.చందు, పీడీ ఎస్.బాలసుబ్రహ్మణ్యం, క్రీడాకారుల ఎంపిక అనంతరం కోచింగ్ ఇన్‌చార్జ్‌లుగా జి.మారప్ప, ఎ.దుర్గయ్య, కె.కళ్యాణ్, పి.నగేశ్ వ్యవహరిస్తారని తెలిపారు. రికర్వ్, కాంపౌండ్, ఇండియన్ రౌండ్లలో పోటీలు జరు గుతాయని పేర్కొన్నారు.అండర్–10కు 2016, జనవరి 1తర్వాత, అండర్–13కు 2013 జన వరి 1 తర్వాత, అండర్–15 విభాగానికి 2011 జనవరి 1 తర్వాత జన్మించిన వారు అర్హులని వారు వివరించారు.
రెండు రాష్ట్రాల స్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు
ఎర్రుపాలెం: మండలంలోని శ్రీఅంకమ్మ, పేరంటాల శ్రీరామలింగయ్య స్వామి ఆలయ ప్రాంగణంలో తిరునాళ్ల సందర్భంగా శుక్రవారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల స్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఖమ్మం, ప్రకాశం, బాపట్ల ,కృష్ణా జిల్లాల రైతులు పోటీల్లో పాల్గొనగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం విజేతలుగా నిర్వాహకులు బహుమతులు అందచేశారు.
ప్రారంభమైన
కరుణగిరి మహోత్సవాలు
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలి టీ పరిధి కరుణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాలను ఉమ్మడి జిల్లా ఆర్‌సీఎం బిషప్ సగిలి ప్రకాష్ శుక్రవా రం ప్రారంభించారు. తొలుత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాక ఆయన మాట్లాడారు. అనంతరం మంగళగిరికి చెందిన డివైన్ మెర్సీ సెంటర్ ఫాదర్ జైసన్ మాట్లాడుతూ మానవులను బతికించేది దేవుడి కృప మాత్రమేనని తెలిపారు. ఈకార్యక్రమంలో కరుణగిరి డైరెక్టర్ ఫాదర్ జానీస్, ఫాదర్ విన్సెంట్, కొమ్ము ఆథోని, ఎలియాస్, యాంజిలో పాల్గొన్నారు.
అప్రమత్తతతోనే
ప్రమాదాల నివారణ
పోలీసు కమిషనర్ సునీల్‌దత్
ఖమ్మంరూరల్: రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవడమే కాక వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి పెద్దతండాలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో రహదారి భద్రతపై శుక్రవారం ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడా రు. రోడ్డు భద్రత ప్రాధాన్యతను ప్రతీ వాహనదారుడికి వివరించేలా ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. వాహనదారులు హెల్మెట్, సీటు బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, డ్రైవింగ్ సమయాన సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండడమే కాక ఇతర నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సదస్సులో డీటీ ఓ జగదీష్, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్‌లు, కళాశాల చైర్మన్ కె.నవీన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా కృష్ణారావు
ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా కృష్ణారావు
ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా కృష్ణారావు
ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా కృష్ణారావు


