వెలుగుమట్ల బాధితులకు అండగా బీఆర్‌ఎస్
ఖమ్మంవైరారోడ్: వెలుగుమట్లలో పేదల గుడిసెలను కూల్చిన పాపం కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా తాకుతుందని ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ వ్యాఖ్యానించారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కొందరి సమస్యే కాదని, రాష్ట్రవ్యాప్తంగా పేదలు ఎదుర్కొంటున్న అన్యాయానికి ప్రతీక అని పేర్కొన్నా రు. ఈమేరకు వెలుగుమట్ల బాధితులకు బీఆర్‌ఎస్ అండగా నిలిచేలా న్యాయపోరాటానికి పార్టీ లీగల్ సెల్ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని తెలిపా రు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణ పునరావా సం కల్పించడమే కాక అక్కడే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు గుండాల కృష్ణ, ఉప్పల వెంకటరమణ, బిచ్చల తిరుమలరావు, గుండ్లపల్లి శేషు, మహమ్మద్ తాజుద్దీన్‌పాల్గొన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్


