ఖమ్మంలో ఇండోర్ విద్యుత్ సబ్‌స్టేషన్
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో తొలిసారిగా ఇండోర్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు కానుంది. విద్యుత్ సేవలను మరింత మెరుగుపర్చడమే లక్ష్యంగా ఖమ్మం పాత బస్టాండ్ ప్రాంగణంలో దీన్ని ఏర్పాటుచేయనున్నారు. ఈమేరకు ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలపగా, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక 33/11 కిలోవాట్ల సామర్ధ్యంతో ఇండోర్ సబ్ స్టేషన్‌ను ఏర్పాటుకు ఎన్పీడీసీఎల్ నుంచి రూ.6.6 కోట్లు మంజూరు చేశారు. భవనం లోపల పూర్తి రక్షణతో పవర్ ట్రాన్స్‌ఫార్మర్, వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్లు, ఆధునిక రక్షణ పరికరాలు, కంట్రోల్ ప్యానెళ్లను అమరుస్తారు. తద్వారా వర్షం, దుమ్ము, దూళి, కాలుష్యం నుంచి రక్షణ లభించి.. లోపాల శాతం తగ్గి విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. అలాగే, నిర్వహణ కూడా సులువవుతుందని అధికారులు తెలిపారు.
పాత బస్టాండ్‌లో ఏర్పాటుకు రూ.6.6 కోట్లు


