ఖమ్మం క్రైం: డ్రైవర్లకు కంటి చూపు కీలకమని, చూపు బాగుంటేనే ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, సీఐ సత్యనారాయణ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన అరైవ్ – అలైన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం వాహనాల డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం మ్యాక్స్ విజన్ కంటి ఆస్పత్రి సహకారంతో 110 మంది డ్రైవర్లకు ఉచిత కంటిపరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు ఇచ్చారు. కంటిచూపు స్పష్టంగా ఉంటే సిగ్నళ్లు, రహదారి సూచనలు గుర్తించగలుగుతారని, అందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.


