కూసుమంచి: హోలీ పర్వదినం జరుపుకోవడంలో ప్రత్యేకంగా నిలుస్తున్న మండలంలోని లోక్యాతండాలో వేడుకలు బుధవారం రెండో రోజుకు చేరాయి. ఈమేరకు అనాదిగా వస్తున్న డూండ్ వేడుకను తండా వాసులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. గత హోలీ నుంచి ఇప్పటి వరకు తండాలో జన్మించిన మగబిడ్డలకు అన్నప్రాసన, నామకరణం చేయడాన్ని డూండ్‌గా పిలుస్తారు. ఈమేరకు గేర్యా(వేడుకల పెద్దలు) తండావాసులతో కలిసి కోలాటం ఆడుతూ డూండ్ జరుపుకునే వారి ఇళ్లకు వెళ్లారు. అక్కడ కోలాటం కర్రలతో పొడవాటి కర్రను కొడుతూ పాటలు పాడుతూ తల్లీబిడ్డలను దీవించారు. కాగా, బుధవారం తెల్లవారుజామున తండాలో నిర్వహించిన కామ దహనంలో పెద్దలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొని పూజలు చేశారు.
వేడుకలో చిన్నారితో తల్లి
రెండో రోజుకు చేరిన
హోలీ వేడుకలు


