వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇటీవల కూల్చివేసిన ఇళ్ల వద్ద నిర్వాసితులు ఫొటోలు
దిగుతున్నారు. ఇంటి శిథిలాలు కనిపించేలా బుధవారం ఫొటోలు దిగుతున్న కొందరిని ఆరా తీయగా.. ఫొటో దిగి ప్రింట్ తీసి ఇవ్వాలని నాయకులు చెప్పినట్లు వెల్లడించారు. ఈవిషయమై ఖమ్మం అర్బన్ తహసీల్‌లో ఆరా తీయగా, తాము ఎవరినీ ఫొటోలు అడగలేదని చెప్పడం
గమనార్హం. దీంతో దళారులెవరైనా మరోమారు బాధితులను మోసం చేసేందుకు
ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈమేరకు అధికారులు స్పందించి
నిర్వాసితులకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్


