రేపు జాబ్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

రేపు జాబ్‌ మేళా

Mar 5 2026 7:27 AM | Updated on Mar 5 2026 7:27 AM

ఖమ్మం రాపర్తినగర్‌: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈనెల 6వ తేదీ శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖా ధికారి ఎన్‌.మాధవి తెలిపారు. మెడ్‌ప్లస్‌లో ఫార్మసిస్ట్‌, క్యాషియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఆడిట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఖమ్మం టేకులపల్లిలోని మోడల్‌ కెరీర్‌ సెంటర్‌లో ఇంటర్వ్యూ లు ఉంటాయని వెల్లడించారు. 18నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో ఉదయం 10గంటలకు మొదలయ్యే ఇంటర్వ్యూలకు హాజరు కావా లని సూచించారు.

మదర్‌థెరిస్సా ఫార్మసీ

కాలేజీకి అటానమస్‌ హోదా

సత్తుపల్లిరూరల్‌: మండలంలోని కొత్తూరులో ఉన్న మదర్‌థెరిస్సా ఫార్మసీ కళాశాలకు స్వ యం ప్రతిపత్తి హోదా మంజూరు చేస్తూ యూ జీసీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. హైదరా బాద్‌ జేఎఎన్‌టీయూకు అనుబంధంగా కొనసాగుతున్న ఈ కళాశాలకు 2030–2031 వరకు అటానమస్‌ హోదా వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈవిషయాన్ని కళాశాల చైర్మన్‌ కంచర్ల సత్యనారాయణ, కరస్పాండెంట్‌ చలసాని సాంబశివరావు, డైరెక్టర్‌ డాక్టర్‌ కందిమళ్ల కృష్ణారావు బుధవారం వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వయం ప్రతిపత్తి పొందిన ఏకై న ఫార్మసీ కళాశాల తమదేనని తెలిపారు. ఈసమావేశంలో ప్రిన్సిపాల్‌ యర్రా రాజేశ్వర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ కుమార్‌రాజా జయవరపు, ఐక్యూ కోఆర్డినేటర్‌ దాసరి ప్రవీణ్‌కుమార్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నూతన కమిటీ

ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నూతన ఉమ్మడి జిల్లా కమిటీని రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ చీమ శ్రీనివాస్‌ బుధవారం ప్రకటించారు. ఖమ్మం బీకే బజార్‌లో జరిగిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ పాలకుర్తి కృష్ణతో పాటు మరికొందరికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొ న్న వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలనికోరారు. ఈ సమవేశంలో నాయ కులుమందా వెంకటేశ్వర్లు, అశోక్‌సింగ్‌, ఎల్‌. ఎస్‌.రెడ్డి, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, అవి బియా, ధనలక్ష్మి, కృష్ణబాబు పాల్గొన్నారు .

ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

భద్రాచలంటౌన్‌: ఐటీడీఏ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభించనున్న గిరి మాల్ట్‌లో పోస్టుల భర్తీకి ఏపీఓ డేవిడ్‌రాజ్‌ భద్రాచలంలో బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. సేల్స్‌ అసోసియేట్‌, క్యాషియర్‌, స్టాక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు యువతీ, యువకులు 15మంది హాజరు కాగా, విద్యార్హత లతో పాటు వ్యాపార లావాదేవీలపై నైపుణ్యాల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

సాగర్‌ కాల్వలో పడి

దివ్యాంగుడు మృతి

ఏన్కూరు: దివ్యాంగ యువకుడు ప్రమాదవశాత్తు సాగర్‌ కాల్వలో పడగా మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏన్కూరుకు చెందిన మల్లు సాయికృష్ణ(30) స్నేహితులతో కలసి బుధవారం హోలీ జరుపుకున్నారు. ఆతర్వాత సిరిపురం మేజర్‌ కాల్వలో స్నానానికి వెళ్లిన ఆయన ఒడ్డున స్నానం చేస్తుండగా కాలు జారి కాల్వలో పడడంతో గల్లంతయ్యాడు. దీంతో గాలిస్తుండగా మృతదేహం లభ్యమైంది. సాయికృష్ణకు నవంబర్‌లో వివాహం జరగగా, పోలీసులు చేరుకుని వివరాలు సేకరించాక పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement