వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయాలా? | - | Sakshi
Sakshi News home page

వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయాలా?

Feb 28 2026 7:34 AM | Updated on Feb 28 2026 7:34 AM

వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయాలా?

వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయాలా?

ఖమ్మంమయూరిసెంటర్‌: భూదాన్‌ భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నేత బాలసాని లక్ష్మీనారాయణ, కార్పొరేటర్‌ కమర్తపు మురళి అన్నారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడారు. భూదాన్‌ భూములపై ప్రతిపక్షాలు తలా ఒకమాట చెబుతున్నాయన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నేతలు, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ జిల్లా మంత్రులపై చేసిన వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సమస్యను పరిష్కరించకపోవడంతో ఇప్పుడు రాద్ధాంతం జరగగా, తమ ప్రభుత్వం పరిష్కారం చూపించబోతుందని తెలిపారు. కాగా, జిల్లా మంత్రులు పేదలకు వ్యతిరేకం కాదని , దళారుల మాటలు విని నివాసముంటూ ఇబ్బంది పడుతున్న అర్హులకు తమ ప్రభుత్వం మంచి దారి చూపించే ప్రయత్నం చేస్తోందన్నారు. పేదల నుంచి డబ్బు వసూలు చేసిన వారిని శిక్షించాలని కలెక్టర్‌ను కోరామని తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మేయర్‌ పునుకొల్లు నీరజ, నాయకులు యర్రం బాలగంగాధర్‌ తిలక్‌, దొబ్బల సౌజన్య, సయ్యద్‌ గౌస్‌, సాధు రమేష్‌రెడ్డి, మూడుముంతల గంగరాజుయాదవ్‌, బచ్చలకూరి నాగరాజు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement