46 మంది ఉపాధ్యాయులకు నోటీసులు | - | Sakshi
Sakshi News home page

46 మంది ఉపాధ్యాయులకు నోటీసులు

Feb 28 2026 7:32 AM | Updated on Feb 28 2026 7:32 AM

46 మం

46 మంది ఉపాధ్యాయులకు నోటీసులు

ఒకరిపై సస్పెన్షన్‌ వేటు

ఖమ్మం సహకారనగర్‌: పలువురు ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తున్నారనే ఆరోపణలు వస్తుండడంతో కలెక్టర్‌ అనుదీప్‌ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఈమేరకు హాజరుపై దృష్టి సారించగా.. పలువురు గైర్హాజరవుతున్నట్లు తేలింది. ఇందులో 14మంది ఓడీ అని అప్‌డేట్‌ చేసుకోగా, 32మంది అసలు ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదు చేసుకోలేదని గుర్తించారు. దీంతో మొత్తం 46మంది ఉపాధ్యాయులకు డీఈఓ చైతన్యజైనీ శుక్రవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అలాగే, ఏన్కూరు ఉపాధ్యాయురాలు జయను సస్పెండ్‌ చేస్తూ డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌ పాఠశాలను తనిఖీ చేయగా ఆమె విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు

ఖమ్మంమయూరిసెంటర్‌: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దే అందించేలా ఆర్టీసీ లాజిస్టిక్‌ విభాగం నిర్ణయించింది. మార్చి 27న భద్రాచలంలో స్వామి కల్యాణం జరగనుండగా, అక్కడకు వెళ్లలేని భక్తుల కోసం దేవాదాయ శాఖ సహకారంతో తలంబ్రాలు చేరవేస్తామని ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ ఏ.సరిరామ్‌ తెలిపారు. ఈమేరకు ప్రచార పోస్టర్లను శుక్రవారం ఆయన ఖమ్మంలో ఆవిష్కరించి మాట్లాడారు. తలంబ్రాలు కావాల్సిన భక్తులు www.tgsrtclogistics.gov.in వెబ్‌సైట్‌ ద్వారా లేదా ఉమ్మడి జిల్లాలోని అన్ని కార్గో సెంటర్లలో రూ.151 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డిప్యూటీ ఆర్‌ఎం యు.రాజ్యలక్ష్మి, ఖమ్మం డీఎం శివప్రసాద్‌, ఉద్యోగులు జ్యోత్స్న, శ్యామలాదేవి పాల్గొన్నారు.

46 మంది  ఉపాధ్యాయులకు  నోటీసులు 
1
1/1

46 మంది ఉపాధ్యాయులకు నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement