ఖమ్మంఅర్బన్: ఖమ్మం వెలుగుమట్ల రెవెన్యూ పరిధి భూదాన్ భూముల్లో ఇటీవల వందలాది నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అంతేకాక ఇన్నాళ్లు వందలాది కుటుంబాలతో కళకళలాడిన ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. అయితే, భూదాన కమిటీ ద్వారా తమకు పట్టాలు ఉన్నాయని పేర్కొంటూ కొందరు కోర్టును ఆశ్రయించగా పది ఇళ్లను మాత్రం అధికారులు వదిలేశారు. వీరి ఇళ్లు మిగిలినా చుట్టూ 700వరకు గృహాలను కూల్చివేయడంతో శిథిలాల నడుమ పది ఇళ్లలోని వారు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈనేపథ్యాన శిథిలాల నడుమ ఉండలేక ఇళ్లకు తాళాలు వేసి వీరు కూడా అంబేద్కర్ భవన్, టీటీడీసీలోని పునరావాస కేంద్రాలకే వెళ్లిపోయారు. పొద్దంతా అక్కడే ఉంటూ సాయంత్రం తిరిగి వస్తున్నామని వారు చెబుతున్నారు. అర్హులతో పాటే తమకు కూడా పునరావాసం కల్పించాలని ఆయా కుటుంబాలు కోరుతున్నాయి.
భూదాన్ భూముల్లో శిథిలాల నడుమ జీవనం


