రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ల సదస్సు హైదరాబాద్‌లో మంగళవారం జరగగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ
సదస్సులో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా
గ్రామసభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం ద్వారా జరుగుతున్న లబ్ధిని ప్రజలకు వివరించాలని, విద్యా
వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొచ్చే మార్పులపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. అలాగే, ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టం చేసేలా సమీపంలోని మెడికల్ కాలేజీలకు
అనుసంధానం చేయాలని, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతీనెల బిల్లులు
చెల్లించాలని పేర్కొన్నారు. – ఖమ్మం సహకారనగర్


