●చిన్నారి వైద్యానికి సహకరించాలని తల్లిదండ్రుల వినతి
ఖమ్మం అర్బన్: ఖమ్మం శ్రీనగర్ కాలనీ 9వ లేన్‌లో నివాసం ఉంటున్న ప్రైవేట్ ఉపాధ్యాయుడు వెంకట నిరంజన్ కుమారుడు, నాలుగో తరగతి చదువుతున్న సలోక్ ఇంటి మొదటి అంతస్తు పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. డాబాపై సోమవారం రాత్రి ఆడుకునే సమయాన ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కాగా, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. సలోక్ మెదడుకు తీవ్ర గాయమైనందున చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని చెబుతున్నారు. ఈమేరకు తన కుమారుడిని ప్రాణాలు కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని కుటుంబీకులు కోరారు.
మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి
ఏన్కూరు: సుజాతనగర్ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య సతీమణి రుక్మిణమ్మ(95) మంగళవా రం అనారోగ్యంతో మృతి చెందారు. ఖమ్మంలో ఉంటున్న ఆమె మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపా రు. కాగా, రుక్మిణమ్మ అంత్యక్రియలు స్వగ్రామమైన ఏన్కూరు మండలం బురదరాఘవాపురంలో బుధవారం నిర్వహించనున్నారు.
మృతుడి ఆచూకీ గుర్తింపు
ఖమ్మంరూరల్: మండలంలోని ఎం.వెంకటాయపాలెం వద్ద సోమవారం రాత్రి మృతి చెందిన వ్యక్తి ఆచూకీ గుర్తించారు. ఖమ్మం గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవీందర్(40) సోమవారం ఉదయం పెనుగంంచిప్రోలు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. ఆయన మృతదేహం రాత్రి ఎం.వెంకటాయపాలెంలో కనిపించినా ఆచూకీ తెలియరాలేదు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా మృతుడిని మంగళవారం గుర్తించగా, రవీందర్ భార్య ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
ఆర్థిక సాయాన్ని 99850 41889
(ఫోన్ పే, గూగుల్ పే) ద్వారా అందించాలని విజ్ఞప్తి చేశారు.


