ఖమ్మంవ్యవసాయం: ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్లు లేని అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా కనెక్షన్లు ఇస్తున్నామని ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలను గుర్తించామని వెల్లడించారు. ఇప్పటి వరకు కారేపల్లి, నేలకొండపల్లి, కూసుమంచి తదితర మండలాల్లోని పలు కేంద్రాలకు ఉచిత కనెక్షన్లు ఇచ్చామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
ఆర్టిజన్లుగా గుర్తించాలని కార్మికుల ధర్నా
ఖమ్మంవ్యవసాయం: ఆర్టిజన్లుగా గుర్తించాలనే డిమాండ్‌తో అన్‌మ్యాన్ కార్మికులు మంగళవా రం ఖమ్మం ఎస్‌ఈ కార్యాలయం వద్ద టీజీ యూఈఈయూ ఆధ్వర్యానధర్నా నిర్వహించా రు. ళ్లుగా పనిచేస్తున్న తమను సంస్థలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీడీసీఎల్ పరి ధిలో విద్యుత్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించినందున ఇక్కడ కూడా అమలుచేయాలన్నారు. అనంతరం ఎస్‌ఈ శ్రీనివాసాచారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూని యన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.ఉపేందర్, కామినేని నాగేశ్వరరావుతో పాటు సత్యనారా యణరెడ్డి, రామయ్య, రామకృష్ణ, రవి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
కోతుల బాధకు చెక్
బోనకల్: బోనకల్ మండల కేంద్రం వాసులు కోతులతో పడుతున్న ఇక్కట్లు తీర్చేలా గ్రామపంచాయతీ పాలకవర్గం నడుం బిగించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సర్పంచ్ బానోతు జ్యోతి, ఉపసర్పంచ్ బానోతు కొండలు దంపతులు కోతులను బంధించేందుకు ప్రత్యేకంగా పలువురిని నియమించారు. ఒక్కో కోతికి రూ.300 చెల్లిస్తుండగా, బంధించిన కోతులను అటవీ ప్రాంతానికి తరలించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మరీదు శేషు, అంతోటి శ్రీను, అంతోటి సునీత, ఎస్‌కే.మీరా, జర్పుల లావణ్య, ఉప్పర శ్రీనుతో పాటు గ్రామస్తులు గుండపనేని సుధాకర్‌రావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
యువకుడిపై కత్తితో దాడి
తిరుమలాయపాలెం: మండలంలోని బీరోలు గ్రామానికి చెందిన కుందూరు ఉదయ్‌పై మంగళవారం రాత్రి పలువురు కత్తితో దాడి చేశారు. హోలీ పండుగ తర్వాత విక్రమ్‌రెడ్డి, కట్ల మహేష్, లింగరాజు మోటార్ సైకిల్‌పై వస్తుండగా ఉదయ్ వారిని పండుగ మామూలు లేదా అని అడుగుతూ బండి ఆఫ్ చేశాడు. ఈక్రమాన మాటామాట పెరిగి ఉదయ్ చేయిపై కల్లు గీసే కత్తితో దాడి చేశారు. ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.


