ఆయిల్‌పామ్‌ పంట లాభదాయకం | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ పంట లాభదాయకం

Feb 28 2026 7:34 AM | Updated on Feb 28 2026 7:34 AM

ఆయిల్‌పామ్‌ పంట లాభదాయకం

ఆయిల్‌పామ్‌ పంట లాభదాయకం

బోనకల్‌: రైతులు ఆయిల్‌పామ్‌ సాగు చేయడం ద్వారా లాభాలు పొందొచ్చని జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఎం.వీ.మధుసూదన్‌రావు తెలిపారు. మండలంలోని గోవిందాపురం, నారాయణపురం గ్రామాల్లో రైతులకు శుక్రవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుల్లో అశ్వారావుపేట ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే ఆయిల్‌పామ్‌తో 30ఏళ్లకు పైగా దిగుబడులు వస్తాయని తెలిపారు. అంతేకాక మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్నందున ధర పెరుగు తూ ఉంటుందని చెప్పారు. ఈమేరకు రైతులు ప్రభు త్వ ప్రోత్సహకాలను వినియోగించుకుంటూ సాగు చేయాలని సూచించారు. అనంతరం ఇప్పటికే ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న వారికి ఎరువుల యాజమాన్యం, నీటి నిర్వహణ, డ్రిప్‌ ఇరిగేషన్‌, గెలల కోతపై అవగాహన కల్పించారు. పట్టు పరిశ్రమ శాఖ డీడీ ముత్యాలు, మధిర ఏడీఏ స్వర్ణ విజయచంద్ర, మధిర ఉద్యాన అధికారి విష్ణు, ఆయిల్‌ఫెడ్‌ ఫీల్డ్‌ అఫీసర్‌ నవ్యతో పాటు ఉద్యోగులు వెన్నెల, సుబ్బారావు, గోవిందాపురం సర్పంచ్‌ మందా కరుణ పాల్గొన్నారు.

ఉపాధ్యాయుడి ప్రవర్తనపై ఆగ్రహం

మధిర: మండలంలోని దెందుకూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ప్రజాప్రతినిధులతోపాటు గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు స్వర్గం శ్రీనివాసరావు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలికలు వారి తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలిసింది. ఈమేరకు సమాచారంతో శుక్రవారం సర్పంచ్‌ పగిడిపల్లి శ్రీని వాసరావు తదితరులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు. గతంలోనూ పోలీసులకు ఫిర్యా దు చేసిన విషయాన్ని ప్రస్తావించగా, అది తన వ్యక్తిగత విషయమని ఉపాధ్యాయుడు బదులిచ్చాడు. ఇకనైనా తీరు మార్చుకోకపోతే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ విషయమై హెచ్‌ఎం రాజకుమారిని వివరణకోరగా...శనివారం బాలికలు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. కాగా, ఘటనపై అధికారులు విచారణ జరిపించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. కాగా, ఉపాధ్యాయుడు శ్రీనివాసరావుపై ఆరోపణల నేపథ్యాన ఉన్నతాధికారులు స్పందించారు. ఈమేరకు విచారణ అధికారిగా మధిర ఎంఈఓ వై.ప్రభాకర్‌తో పాటు ఒక కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడిని నియమించినట్లు సమాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement