అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మం సహకారనగర్: గిరిజన సంక్షేమ శాఖ పరిధి పాఠశాలల్లో ద్వితీయ శ్రేణి భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్ డిమాండ్ చేశారు. ఈమేరకు కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించగా ఆయన మాట్లాడారు. 2022–2023 విద్యాసంవత్సరం నుంచి ఇప్పటివరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఒక సమస్య కూడా పరిష్కరించలేదన్నారు. ఇకనైనా స్పందించకపోతే మార్చి 10వ తేదీన గిరిజన సంక్షేమ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన చేపడుతామని తెలిపారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏవీ.నాగేశ్వరరావు, టి.వెంగళరావు, నాయకులు వెంకటేశ్వర్లు, సంధ్య, జి.వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు, ఎం.నాగిరెడ్డి, గరిక శ్రీనివాస్, ఆకుల వెంకటేశ్వర్లు, భావ్‌సన్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయ్


