ప్రతిభ కనబరిస్తే నగదు పురస్కారం, ఢిల్లీ యాత్ర | - | Sakshi
Sakshi News home page

ప్రతిభ కనబరిస్తే నగదు పురస్కారం, ఢిల్లీ యాత్ర

Mar 1 2026 7:31 AM | Updated on Mar 1 2026 7:31 AM

ప్రతిభ కనబరిస్తే నగదు పురస్కారం, ఢిల్లీ యాత్ర

ప్రతిభ కనబరిస్తే నగదు పురస్కారం, ఢిల్లీ యాత్ర

ఖమ్మంగాంధీచౌక్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతూ వార్షిక పరీక్షల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు నగదు బహుమతులు అందించడమే కాక ఢిల్లీకి విజ్ఞానయాత్రకు తీసుకెళ్లనున్నట్లు మిత్రా ఫౌండేషన్‌ బాధ్యులు ప్రకటించారు. ఈ మేరకు కార్యక్రమ బ్రోచర్‌ను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి శనివారం ఆవిష్కరించారు. అనంతరం మిత్రా ఫౌండేషన్‌ చైర్మన్‌, ఖమ్మం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కురువెళ్ల ప్రవీణ్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ఐదుగురు విద్యార్థులకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతులు అందిస్తామని తెలిపారు. అంతేకాక మూడు రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రధాన కార్యదర్శి జీవై నరేశ్‌తో పాటు బి.నర్సింహారావు, పాలవరపు శ్రీనివాస్‌, రంగనాగ శ్రీనివాస్‌, చెరుకూరి యుగంధర్‌, చారుగండ్ల రవికుమార్‌, మహంకాళి నగేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement