‘ఉపాధి’ కార్మికులకు బీమా కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ కార్మికులకు బీమా కల్పించాలి

Mar 1 2026 7:31 AM | Updated on Mar 1 2026 7:31 AM

‘ఉపాధ

‘ఉపాధి’ కార్మికులకు బీమా కల్పించాలి

రఘునాథపాలెం: ఉపాధి కార్మికులకు రూ.5లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్‌ బొప్పని పద్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం మండలం బూడిదంపాడు గ్రామంలో ఇటీవల ఉపాధి పనికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సప్పిడి రాధ కుటుంబాన్ని రాష్ట్ర బృందం పరామర్శించి ఆమె కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. పాలకుల విధానాలపై ఉపాధి కార్మికులు, సిబ్బంది ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా కూలీల రాష్ట్ర నాయకులు శెట్టి వినోద, లోకిని స్వరూప, మొగులోజు శారద, బందం వెంకటరాజ్యం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్‌, నాయకుడు ప్రతాపనేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయంపై

అవగాహన

ఖమ్మంరూరల్‌: పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించడంలో ప్రకృతి వ్యవసాయం ఎంతో కీలకమని కూసుమంచి ఏడీఏ సతీష్‌ అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలోని ముత్తగూడెంలో ప్రకృతి వ్యవసాయంపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రసాయన ఎరువులు, పురుగుమందులు లేకుండా పంటలు సాగు చేయడం వల్ల ఖర్చు తగ్గడంతో పాటు దిగుబడి కూడా పెరుగుతుందన్నారు. కొంతమంది రైతులు నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ పార్మింగ్‌ పథకం ద్వారా వ్యసాయం చేయడం అభినందనీయమన్నారు. అనంతరం రైతులకు మృత్తిక కార్డులు పంపిణీ చేశారు. ఏఓ ఉమానగేశ్‌, ఏఈఓలు పాల్గొన్నారు.

‘ఉపాధి’ కార్మికులకు  బీమా కల్పించాలి1
1/1

‘ఉపాధి’ కార్మికులకు బీమా కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement