ప్రతిభ వెలికితీత, ప్రోత్సాహానికి పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రతిభ వెలికితీత, ప్రోత్సాహానికి పరీక్షలు

Mar 6 2026 8:14 AM | Updated on Mar 6 2026 8:14 AM

భద్రాచలం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభ వెలికితీయడంతో పాటు ప్రోత్సహించేందుకు ముందస్తు పరీక్షలు దోహదపడతాయని ఐటీడీఏ ప్రాజెక్టు అఽధికారి బి.రాహుల్‌ తెలిపారు. భద్రాచలంలోని ఏజీహెచ్‌ఎస్‌ బాలికల ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న పరీక్షలను గురువారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఆందోళనకు గురికాకుండా వార్షిక పరీక్షలు రాసేలా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 89 గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో 395 మంది పరీక్షలు రాశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీడీ అశోక్‌, ఏపీఓ జనరల్‌ డేవిడ్‌ రాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

13న పండితాపురం

సంత వేలం

కామేపల్లి: పశువుల క్రయ, విక్రయాలకు రాష్ట్రంలోనే పేరున్న పండితాపురం వారాంతపు సంత వేలం ఈనెల 13న నిర్వహిస్తున్నట్లు కొమ్మినేపల్లి సర్పంచ్‌, కార్యదర్శులు ధరావత్‌ అనురాధ, శంకర్‌ తెలిపారు. శ్రీ కృష్ణప్రసాద్‌ పశువుల సంత బహిరంగ వేలం ఈనెల 13న సంత ఆవరణలో ఉదయం 11గంటలకు మొదలవుతుందని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 31వరకు కాల పరిమితితో నిర్వహించే వేలంలో పీసా చట్టం ప్రకారం గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్టీలకు మాత్రమే అర్హులని తెలిపారు. రూ.30 లక్షల ధరావతు, రూ.5లక్షల సాల్వెన్సీని డీడీ లేదా నగదు రూపంలో చెల్లించి పాల్గొనాలని సూచించారు.

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పలు కార్యక్రమాలకు మంత్రి హాజరవుతారు. ఆతర్వాత 10గంటల కు ఖమ్మం కలెక్టరేట్‌లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికపై జరిగే ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.

స్టాఫ్‌ అసిస్టెంట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన

ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపికై న వారి సర్టిఫికెట్ల పరిశీలన మొదలైంది. డీసీసీబీలో 99 ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష నిర్వహించగా ఫిబ్రవరి 17న ఫలితాలు వెల్లడించారు. ఇందులో ఎంపికై న 98 మంది సర్టిఫికెట్ల పరిశీలన బుధవారం డీసీసీబీ ప్రధా న కార్యాలయంలో సీఈఓ ఎన్‌.వెంకటఆదిత్య పర్యవేక్షణలో ప్రారంభమైంది. ఏప్రిల్‌ మొదటి వారంలోగా అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేసే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement