కందుకూరు ఆలయాభివృద్ధికి సహకారం
వేంసూరు: మండలంలోని కందుకూరులో 500 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం మరింత అభివృద్ధి చెందేలా సహకరిస్తామని ఎమ్మె ల్యే మట్టా రాగమయి తెలిపారు. ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం శనివారం జరగగా ఆమె పాల్గొన్నా రు. ఆలయ చైర్మన్‌గా బండి వెంకటకృష్ణారెడ్డి, కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. అనంతరం కందుకూరులో ఇందిర మ్మ ఇళ్లను ప్రారంభించా రు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాసరి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు గొర్ల వెంకటప్పారెడ్డి, గొర్ల సంజీవరెడ్డి, కొప్పుల వెంకటేశ్వరరెడ్డి, బాపిరెడ్డి, బూరుగు రవి నాయకులు పాల్గొన్నారు. కాగా, వేంకటేశ్వరస్వా మి కల్యాణ వేడుకల్లో భాగంగా శనివారం ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ఆదివారం రాత్రి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి టైలర్స్ యూనియన్ ఆధ్వర్యాన శనివారం స్థానిక కళాభారతిలో టైలర్స్ డే వేడుకలు నిర్వహించారు. తొలుత ర్యాలీ నిర్వహించగా, అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే రాగమయి మాట్లాడారు. టైలర్లకు ప్రభుత్వం తరఫున చేయూతగా నిలుస్తామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఎండీ రెహానాబేగం, యూనియన్ అధ్యక్షుడు ఉమామహేశ్వరరావుతో పాటు టైలర్లు, నాయకులు ఇమాం, వెంకటాచారి, ఎండీ యాసిర్, డీఎన్ చారి, మహమూద్, శ్రీను, రాము, సతీశ్, గాదె చెన్నారావు పాల్గొన్నారు.


