స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం | - | Sakshi
Sakshi News home page

స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం

Mar 7 2026 8:20 AM | Updated on Mar 7 2026 8:20 AM

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలతో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రేపు హ్యాండ్‌బాల్‌

జట్టు ఎంపిక పోటీలు

ఖమ్మం స్పోర్ట్స్‌: జిల్లాస్థాయి సీనియర్‌ పురుషు ల హ్యాండ్‌బాల్‌ జట్టు ఎంపికకోసం ఈనెల 8వ తేదీన పోటీలు నిర్వహిస్తున్నట్లు హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి పి.రఘునందన్‌ తెలిపారు. ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఉదయం 10గంటలకు మొదలయ్యే పోటీలకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్‌కార్డుతో హాజ రుకావాలని సూచించారు. ఇక్కడ ఎంపిక చేసే జిల్లా జట్టు ఈనెల 13నుంచి హైదరాబాద్‌ చింతల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు.

పోగొట్టుకున్న

నగదు అందజేత

మధిర: మధిరలో ఓ వ్యక్తి పోగొట్టుకున్న నగదును టౌన్‌ పోలీసులు గుర్తించి అందజేశారు. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలం కలగరకు చెందిన రావుల అప్పారావు కోదాడలో ట్రాక్టర్‌ ట్రక్‌ కొనుగోలుకు వెళ్తున్నాడు. ఈ క్రమాన ఆయన జేబులో ఉన్న రూ.60వేల నగదును మధిర శాంతిథియేటర్‌ సమీపాన పోగొట్టుకున్నాడు. ఘటనపై టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఐ రమేష్‌ సీసీ కెమెరాలు పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించా రు. దీంతో సిబ్బంది శివ, రమేష్‌ ఆ మార్గంలో సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి రూ.60వేల నగదు గుర్తించి అప్పగించగా అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా సీఐ రమేష్‌ మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల అనేక లాభా లు ఉన్నందున ఇళ్లు, షాపుల్లో అమర్చుకోవా లని సూచించారు. ఎస్సై నవిత, సిబ్బంది పాల్గొన్నారు.

తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఐటీడీఏ, నిమ్స్‌ మే (హైదరాబాద్‌) సంయుక్త ఆధ్వర్యాన గిరిజ న యువత, రైతులకు తేనెటీగల పెంపకంపై ఐదు రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీ ఏ పీఓ బి.రాహుల్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 18–40ఏళ్ల లోపు వారు శిక్షణకు అర్హు లని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న మహిళలు, పురుషులు తమ విద్యార్హత పత్రాలు, ఆధార్‌ కార్డు, కులధ్రువీకరణ జిరాక్స్‌లతో ఈనెల 12న ఉదయం 9 గంటలకు భద్రాచలం ఐటీడీ ఏ ప్రాంగణంలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు రావాలని పీఓ సూచించారు.

నైపుణ్య శిక్షణ కేంద్రంలో మహిళా దినోత్సవం

ఖమ్మం రాపర్తినగర్‌: ఖమ్మంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో శుక్రవారం మహిళా దినో త్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన వేడుకల్లో డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా ఉపాధి రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈమేరకు మూడు నెలల శిక్షణ శిబిరం ముగియగా, ట్రెయినీలను సన్మానించారు. ఈకార్యక్రమంలో మేనేజర్‌ ఉదయ్‌కుమార్‌, హరిబాబు తది తరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement