సత్తుపల్లిటౌన్: ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రక్కును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రగాయాలతో మృతి చెందాడు. సత్తుపల్లి మండలం సదాశివునిపేటలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లి మండలం సిధ్దారం గ్రామానికి చెందిన గద్దల మనోజ్(16), గద్దల కార్తీక్(18) సత్తుపల్లిలో ఓ కన్సల్టెన్సీలో పని చేస్తున్నారు. వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై మర్లపాడు వెళ్లి వస్తుండగా సదాశివునిపేట శివాలయం సమీ పాన రోడ్డు ప్రక్కన నిలి పి ఉన్న ట్రాక్టర్ ట్రక్కు ను ఢీకొట్టారు. దీంతో తీవ్రగాయాలు కాగా మనోజ్, గద్దల కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించినట్లు సత్తుపల్లి సీఐ శ్రీహరి తెలిపారు. కాగా, వీరిద్దరికి ఒకే గ్రామం కావడమే కాక ఒకే వీధి కావడంతో సిద్ధారం వాసులు పెద్దసంఖ్యలో చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రక్కును ఢీకొట్టడంతో ఘటన


