ఉత్పత్తి వ్యయం తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్పత్తి వ్యయం తగ్గించాలి

Mar 7 2026 8:20 AM | Updated on Mar 7 2026 8:20 AM

గరిష్టం / కనిష్టం

380 / 220

వాతావరణ ం
జిల్లాలో శనివారం ఎండ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది.

మణుగూరు టౌన్‌: యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని, సమష్టి కృషితో లక్ష్య సాధనకు కృషి చేయాలని సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్‌ జ్యోతి అన్నారు. శుక్రవారం మణుగూరు ఏరియాలో డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ఎల్‌వీ సూర్యనారాయణ, డైరెక్టర్‌(పీఅండ్‌పీ) కె.వెంకటేశ్వర్లుతో కలిసి పర్యటించారు. తొలుత పీకేఓసీ–2 గనిని వ్యూ పాయింట్‌ నుంచి బొగ్గు ఉత్పత్తి, లోడింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. ఓసీలో షావెల్స్‌ భారీ యంత్రాల పనితీరును పరిశీలించి, బొగ్గు నాణ్యతపై ఆరా తీశారు. అనంతరం ఓసీ–4లో సర్ఫేస్‌ మైనర్‌ భారీ యంత్రం ద్వారా జరిగే బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కోల్‌ బెంచ్‌లో బొగ్గు నాణ్యత పరిశీలించి వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం జీఎం కార్యాలయంలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఏరియా ఉత్పత్తి లక్ష్యాలు అధిగమిస్తున్న తీరును, కొత్త ప్రాజెక్ట్‌ వివరాలను జీఎం దుర్గం రాంచందర్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో జీఎం(సీడీఎన్‌) టి.శ్రీనివాస్‌, అధికారులు శ్రీనివాసచారి, రమేశ్‌, వేణుమాధవ్‌, శ్రీనివాస్‌, వెంకట్రావు, రాంబాబు, రమేశ్‌, జ్యోతిర్మయి, సౌరబ్‌ సుమన్‌, సురేశ్‌, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్‌ జ్యోతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement