ఎఫ్‌ఎల్‌ఎన్‌ – ఏఐలో జిల్లా ముందంజ | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎల్‌ఎన్‌ – ఏఐలో జిల్లా ముందంజ

Mar 1 2026 7:31 AM | Updated on Mar 1 2026 7:31 AM

ఎఫ్‌ఎల్‌ఎన్‌ – ఏఐలో  జిల్లా ముందంజ

ఎఫ్‌ఎల్‌ఎన్‌ – ఏఐలో జిల్లా ముందంజ

ఖమ్మం సహకారనగర్‌: ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్‌)లో భాగంగా ఆర్టిఫీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ఆధారిత బోధనలో జిల్లా ముందంజలో నిలిచింది. విద్యార్థులు కంప్యూటర్ల ద్వారా స్వీయ అభ్యసన విధానాన్ని జిల్లాలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది ప్రారంభించారు. ఇంకొన్ని జిల్లాలోని పాఠశాలల్లో కూడా అమలుచేస్తుండగా రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ప్రథమ స్థానాన నిలిచింది. ఈమేరకు జిల్లా విద్యాశాఖను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అభినందించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఖమ్మం ఎన్నెస్పీ కాలనీ జీపీఎస్‌ ఉపాధ్యాయులు ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాను ముందంజలో నిలిపిన ఉపాధ్యాయులను డీఈఓ చైతన్యజైనీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement