శ్రీవారికి నిత్యకల్యాణం, పల్లకీసేవ | - | Sakshi
Sakshi News home page

శ్రీవారికి నిత్యకల్యాణం, పల్లకీసేవ

Mar 1 2026 7:31 AM | Updated on Mar 1 2026 7:31 AM

శ్రీవారికి నిత్యకల్యాణం, పల్లకీసేవ

శ్రీవారికి నిత్యకల్యాణం, పల్లకీసేవ

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడిలోని స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి, శ్రీ అలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లను అలంకరించి నిత్యకల్యాణం జరిపించారు. ఆతర్వాత నిర్వహించిన పల్లకీ సేవలో తెలంగాణ, ఏపీ ప్రాంతాల భక్తులు పాలుపంచుకున్నారు. ఈఓ జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11–45గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల మండలాల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లను మంత్రి సన్మానించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో శ్రీరామనవమి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తారు. అలాగే, సాయంత్రం ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందులో మంత్రి పొంగులేటి పాల్గొంటారు.

నేడు ఖమ్మానికి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఖమ్మం మామిళ్లగూడెం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు ఆదివారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఆయన ఉద యం 9–30 గంటలకు కోదాడ క్రాస్‌ వద్దకు చేరుకుంటారని పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. అనంతరం 10–30 గంటలకు ఖమ్మంలో జరిగే మాజీ ప్రధాని అట ల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి ఉత్సవ సభలో పాల్గొంటారని వెల్లడించారు. ఆతర్వాత భూదా న్‌ భూముల్లో ఇళ్లు కూల్చివేసిన స్థలాన్ని పరిశీ లించనున్న రామచంద్రరావు.. అంబేద్కర్‌ భవ న్‌లో బాధితులను పరామర్శిస్తారని తెలిపారు.

నెమలికి ప్రత్యేక బస్సులు

వైరా: ఏపీలోని కృష్ణా జిల్లా నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో కల్యాణం(జాతర) నేపథ్యాన ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ మధిర డిపో మేనేజర్‌ ఆర్‌.రామయ్య తెలిపా రు. వైరా బస్టాండ్‌ నుంచి గంపలగూడెం మీదుగా నెమలి వరకు బస్సు సర్వీసులు ఉంటా యని వెల్లడించారు. ఈమేరకు సోమవారం తెల్లవారుజామున 5గంటల నుంచి ప్రతీ అర గంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని, నెమలి వెళ్లే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

శ్రీ స్తంభాద్రి ఆలయ

అభివృద్ధి కమిటీ ఏర్పాటు

ఖమ్మంగాంధీచౌక్‌: ఖమ్మంలోని స్వయంభూ శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం(గుట్ట) అభివృద్ధి(రెన్నోవేషన్‌) కమిటీని నియమి స్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు కొనసాగే ఈ కమిటీలో పది మందికి అవకాశం కల్పించారు. ఇందులో కర్నాటి రాధిక, చిన్ని మధుసూదన్‌రావు, చల్లా మధుసూదన్‌రావు, మోర్ల శ్రీనివాస్‌, మందడపు సాయివెంకటకృష్ణ, కొల్లా నాగేందర్‌, కూరపాటి ప్రదీప్‌కుమార్‌, చారుగండ్ల రవికుమార్‌, పంతం సీతారాములు, శనగవరపు ప్రసాద్‌ ఉన్నారు. వీరిలో శనగవరపు ప్రసాద్‌ 2012 నుంచి 2016 వరకు దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. పురాతనమైన ఈ ఆలయానికి మూడేళ్ల తర్వాత అభివృద్ధి కమిటీ ని నియమించినా ట్రస్ట్‌ బోర్డు కాకపోవడంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు ఇవ్వలేదు. ఇందు కు అడ్డంకులు ఉన్నందున త్వరలోనే సభ్యుల్లో ఒకరికి చైర్మన్‌గా నియమిస్తారనే చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement