మొదలైన ‘కొదమూరు’ రెండో దశ పనులు | - | Sakshi
Sakshi News home page

మొదలైన ‘కొదమూరు’ రెండో దశ పనులు

Mar 3 2026 7:27 AM | Updated on Mar 3 2026 7:27 AM

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం వెలుగుమట్ల గుట్ట సమీపాన ఉన్న కొదమూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి సంబంధించి రెండో దశ పనులు వేగంగా సాగుతున్నాయి. రెండు నెలల క్రితం ఈ పనులకు శంకుస్థాపన చేయగా అవసరమైన పైపులను లిఫ్ట్‌ ప్రాంతంలో రెండు రోజులుగా చేరుస్తున్నారు. సుమారు రూ.30 కోట్ల అంచనా వ్యయంతో పథకం రెండో దశ పనులు చేపట్టనుండగా, మొత్తం 10 కి.మీ. పైపులైన్‌ ద్వారా నీటి పంపింగ్‌ చేస్తారు. ముందుగా నాగపూర్‌–అమరావతి నేషనల్‌ హైవే నిర్మాణంలో అడ్డంకులు లేకుండా 3.5 కి.మీ. మేర పైపులైన్‌ వేయనున్నారు. ఈ క్రమాన భూసేకరణ సమస్య రాకుండా సుమారు నాలుగు అడుగుల వ్యాసం కలిగిన మైల్డ్‌ స్టీల్‌(ఎంఎస్‌) పైపులు వినియోగించునున్నారు. ఆతర్వాత మిగతా పైప్‌లైన్‌కు సాధారణ పైపులే వినియోగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement