నెమలి జాతరకు ప్రత్యేక బస్సులు
మఽధిర : ఏపీలోని గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా సోమవారం మధిర బస్టాండ్ నుంచి నెమలి వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ మధిర డీఎం ఆర్.రామయ్య ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం 5 గంటల నంచి మధిర బస్టాండ్‌లో బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాత్రి స్వామివారి కల్యాణం ముగిసే వరకు నెమలి నుంచి మధిరకు బస్సులు తిరుగుతుంటాయని పేర్కొన్నారు. మధిర నుంచి నెమలికి పెద్దలకు రూ.60, పిల్లలకు రూ.30 చార్జీ ఉంటుందని వివరించారు.
వైభవంగా
లక్ష్మీ నృసింహుల కల్యాణం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం నగరంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం(గుట్ట)లో నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి వార్షిక జయంతి ఉత్సవాల్లో బాగంగా ఆదివారం లక్ష్మీ నృసింహుల కల్యాణోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రేపు ఆలయం మూసివేత
ఎర్రుపాలెం: చంద్రగ్రహణం సందర్భంగా జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేసి, తిరిగి బుధవారం ఉదయం తెరుస్తామని ఈఓ కె.జగన్మోహన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీ ఉదయం 9 గంటలకు ద్వారబంధనం చేస్తామని, బుధవారం ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేశాక 9 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.
సీఎం కప్ కరాటే టోర్నీలో ఆరు పతకాలు
ఖమ్మం స్పోర్ట్స్ : సీఎం కప్ రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో జిల్లాకు వివిధ కేటగిరిల్లో ఆరు పతకాలు దక్కాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన కరాటే క్రీడాకారుడు బి.సందీప్ 75 కేజీల కేటగిరిలో స్వర్ణపతకం సాధించగా, జూనియర్ బాలికల విభాగంలో ముష్కన్ పర్వీన్, తన్మయి లక్ష్మి, బాలురలో అదిల్ పాషా, హర్షతేజ, అశుద్దీన్ కాంస్య పతకాలు సాధించారు. వారిని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, జట్టు కోచ్ గోపతి సైదులు, జిల్లా కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు జి.రాములు అభినందించారు.
నెమలి జాతరకు ప్రత్యేక బస్సులు


