ఇష్టంతోనే విద్య.. | - | Sakshi
Sakshi News home page

ఇష్టంతోనే విద్య..

Mar 8 2026 7:53 AM | Updated on Mar 8 2026 7:53 AM

ఇష్టంతోనే విద్య.. ఎంచుకున్న కోర్సులోనే... ●

వృత్తి విద్యా కోర్సులతో పాటు రెగ్యులర్‌ డిగ్రీ కోర్సుల్లో సైతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయనే విశ్వాసంతో డిగ్రీ కోర్సులను ఎంపిక చేసుకున్నా. తల్లిదండ్రులకు చదువుపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో మంచి కళాశాలను ఎంచుకొమ్మని మాకే చెబుతున్నారు. కొన్ని అంశాల్లో మాత్రం వారి సూచనలు పాటిస్తున్నాం.

– వేముల నందిని, డిగ్రీ ద్వితీయ సంవత్సరం

తల్లిదండ్రులు, స్నేహితుల సలహాలు, సూచనలతో ఎంచుకున్న కోర్సులోనే చదువుతున్నా. అందరి తల్లిదండ్రులు కూడా చదువు విషయంలో పిల్లలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేలా చూడాలి. తద్వారా విద్యార్థులు లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. పిల్లలు కూడా క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు.

– జి.చంద్రమౌనిక, డిగ్రీ విద్యార్థిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement