శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

Mar 1 2026 7:31 AM | Updated on Mar 1 2026 7:31 AM

శతాబ్ది ఉత్సవాలు  ప్రారంభం

శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

ఖమ్మంగాంధీచౌక్‌: ఖమ్మానికి చెందిన జీవీ మాల్‌ వ్యవస్థాపకులు గుర్రం వెంకటేశ్వర్లు వందో జయంతిని పురస్కరించుకుని వైరా రోడ్డులోని జీవీ షాపింగ్‌ మాల్‌లో శతాబ్ది ఉత్సవాలను శనివారం ప్రారంభించారు. శతాబ్ది వేడుకల సందర్భంగా ఏడాది పొడవునా ఆఫర్లు ఇస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. కాగా, ఉత్సవాల ప్రారంభోత్సవంలో సినీ, టీవీనటులు ఆది, శాంతిస్వరూప్‌, రాజు, దొరబాబు, దీపిక తదితరులు పాల్గొని సందడి చేశారు. కార్యక్రమంలో షోరూమ్‌ యాజమాన్యం గుర్రం ఉమామహేశ్వరరావు, గుర్రం వాసు, గుర్రం రేవంత్‌, గుర్రం అంకిత్‌ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

వ్యక్తి మృతి

కొణిజర్ల: ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని లాలాపురం – తీగలబంజర గ్రామాల మధ్య చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని లాలాపురం గ్రామానికి చెందిన షేక్‌ అక్బర్‌ (40) ఏన్కూరు మండల కేంద్రంలో పాత ఇనుము దుకాణం నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి ఆయన దుకాణం మూసివేసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా తీగలబంజర సమీపంలోని కోల్డ్‌ స్టోరేజీ వద్ద ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఘటనలో అక్బర్‌ తలకు తీవ్ర గాయం కాగా 108 ద్వారా ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement