రఘునాథపాలెం: మండలంలోని పువ్వాడనగర్‌లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక డంప్ యార్డ్(ప్రాసెసింగ్ యూనిట్) నిర్మిస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారి ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఇందుకోసం ఎకరం భూమిని కేటాయించగా రూ.50లక్షల వ్యయంతో భారీ షెడ్డు నిర్మాణ పనులు మొదలయ్యాయి ప్లాస్టిక్ వ్యర్థాలను శాసీ్త్రయ పద్ధతిలో ప్రాసెస్ చేసి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ యూనిట్ ఏర్పాటు చేస్తుండగా.. ఇక్కడ విజయవంతమైతే అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. డంపింగ్ యార్డ్‌తో ప్లాస్టిక్ వ్యర్థాలకు శాశ్వత పరిష్కారం లభించడమే కాక పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని చెబుతున్నారు.
పువ్వాడనగర్‌లో ఏర్పాటుకు శ్రీకారం


