బడాబాబుల కోసమే పేదల ఇళ్లు కూల్చివేత
ఖమ్మం మామిళ్లగూడెం: బడా బాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే భూదాన్ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను నేలమట్టం చేశారని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ధ్వజమెత్తారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడుతూ దశాబ్దాల క్రితం పేదలు చిన్నపాటి గుడిసెలు వేసుకుని జీవిస్తుంటే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. అంతేకాక కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వకుండానే రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లు నేలమట్టం చేయడం గర్హనీయమన్నారు. ఆ ప్రాంతంలో విలాసవంతమైన గృహాలు నిర్మించాలని మంత్రులు కల కంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, నాయకులు మందడపు సుబ్బారావు, నకిరికంటి వీరభద్రం, వీరవెల్లి రాజేష్, రవి, శాసనాల సాయిరాం, మందా సరస్వతి, రుద్రగాని మాధవ్, పిల్లలమర్రి వెంకట్, పాలెపు రాము, నలమాస్ శ్రీనివాస్, వల్లాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వాసుదేవరావు


