చోరీ కేసులో నిందితుడు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితుడు అరెస్ట్‌

Mar 3 2026 7:28 AM | Updated on Mar 3 2026 7:28 AM

పెనుబల్లి: జ్యూఝెలరీ షాప్‌లో ఆభరణాల చోరీ కేసులో నిందితుడినివీఎం బంజరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈమేరకు సోమవారం సత్తుపల్లి రూరల్‌ సీఐ ముత్తిలింగయ్య వెల్లడించిన వివరాలు... పెనుబల్లి మండలం వీఎంబంజరులోని ఆచారి జ్యూఝెలరీ షాప్‌నకు గత నెల 7వ తేదీన వచ్చిన వ్యక్తి షాపులోని వారిని మభ్యపెట్టి షోకేస్‌లో ఉన్న 36 గ్రాముల బరువైన 9బంగారం ఉంగరాలు అపహరించి పారిపోయాడు. ఆపై వీఎం బంజరు ఎస్సై కె.వెంకటేష్‌, తన సిబ్బందితో విచారణ చేపట్టగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం భీమవరానికి చెందని గొర్రెల సత్యనారాయణ నిందితుడికి తేలింది. ఆయన తిరువూరుకు వెళ్తుండగా వీఎం బంజరు బస్టాండ్‌లో అదుపులోకి తీసుకుని విచారించడంతో తిరువూరులో రూ.1.20 లక్షలకు తాకట్టు పెట్టినట్లు చెప్పడంతో స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కాగా, నిందితుడు సత్యనారాయణపై 28 కేసులు ఉన్నాయని, ఓ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చాక మళ్లీ చోరీలు మొదలుపెట్టాడని వెల్లడించారు.

గుప్తనిధుల పేరిట తవ్వకాల్లో...

గుప్తనిధులు ఉన్నాయనే భావనతో తవ్వకాలు చేపట్టిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతనెల 20వ తేదీన మండలంలోని ఏరుగట్ల శివార్లలో కొందరు జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. ఈ విషయం అందిన సమాచారంతో వీఎం బంజరు పోలీసులు వెళ్లే సరికి నిందితులు పరారయ్యారు. వీరి కోసం గాలిస్తుండగా నిందితులు సోమవారం లొంగిపోయారని సీఐ ముత్తిలింగయ్య తెలిపారు. వీరి నుంచి జేసీబీ, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement