సత్తుపల్లిరూరల్: తెలంగాణ ప్రభుత్వానికి ఇటీవల విద్యా కమిషన్ సమర్పించిన నివేదికలో ఉపాధ్యాయుల పట్ల కక్షపూరిత వైఖరి కనిపించిందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ ఆరోపించారు. సత్తుపల్లి మండల కమిటీ సమావేశం సోమవారం జరగగా ఆయన మాట్లాడుతూ నివేదిక ఉపాద్యాయులను భయబ్రాంతులకు గురి చేసేలా ఉందని తెలిపారు. టీచర్లకు అధిక జీతాలు ఉన్నాయని పేర్కొనడం, అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ల రద్దు, పనితీరు ఆధారంగా పదోన్నతులు, లేకపోతే ఉద్యోగం నుంచి తొలగింపు వంటి సిఫారసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, ప్రభుత్వం రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరెడ్డి, నాయకులు చెరుకు శ్రీనివాసరావు, కే.వీ.రాజేశ్వరరావు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హెచ్.సూరయ్య, అశోక్ చక్రవర్తితో పాటు ఐ.నాగేశ్వరరావు, ఎం.మధు, జి.శేఖర్, సుకుమార్, వైఎస్‌ఆర్ పాల్గొన్నారు.


