‘సూర్య ఘర్‌’తో ప్రయోజనం | - | Sakshi
Sakshi News home page

‘సూర్య ఘర్‌’తో ప్రయోజనం

Mar 3 2026 7:28 AM | Updated on Mar 3 2026 7:28 AM

ఖమ్మంవ్యవసాయం: పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన పథకాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ఆయన సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన, ప్రజా పాలన – ప్రగతి పాలన కార్యాచరణపై అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్షించారు. తొలుత సూర్యఘర్‌ అవగాహన పోస్టర్లు ఆవిష్కరించాక కలెక్టర్‌ మాట్లాడారు. ఈ పథకం ద్వారా సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున ఉద్యోగులు ముందుకు రావాలని తెలిపారు. సబ్సిడీ పోగా మిగతా నగదు బ్యాంకు లోన్‌ ద్వారా సమకూర్చుకోవచ్చని వెల్లడించారు.

కట్టుదిట్టంగా ప్రణాళిక

ప్రభుత్వం ఈనెల 6నుంచి జూన్‌ 12వ తేదీ వరకు ‘99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణ’ నిర్వహించనున్నందున షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాల అమలుకు అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యాచరణలో భాగంగా మున్సిపల్‌, పంచాయతీ శాఖల అధికారులు సంక్షేమ పథకాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌డీసీ ఎం.రాజేశ్వరి, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, రెడ్కో జిల్లా మేనేజర్‌ అజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు

పరీక్షలు ప్రశాంతంగా రాయండి

ఖమ్మం సహకారనగర్‌: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సూచించారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించగా కలెక్టర్‌ మాట్లాడారు. జీవితంలో పదో తరగతికి ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆందోళనకు గురికావొద్దన్నారు. పరీక్షలకు మరో రెండు వారాల సమయం ఉన్నందున గత కొన్నేళ్ల ప్రశ్నపత్రాల ఆధారంగా సిద్ధం కావాలని సూచించారు. అనంతరం మోటివేషన్‌ స్పీకర్‌ గంపా నాగేశ్వరరావు మాట్లాడగా డీఈఓ చైతన్యజైనీ, ఖమ్మం అర్బన్‌ ఎంఈఓ శైలజాలక్ష్మి, డీసీఈబీ కార్యదర్శి కనపర్తి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్‌ కమర్తపు మురళి, మిత్ర గ్రూప్‌ చైర్మన్‌ కురువెళ్ల ప్రవీణ్‌కుమార్‌తో పాటు శ్రీనివాస్‌, యుగంధర్‌, మహంకాళి గణేష్‌, ఉపేందర్‌, సీతారాంబాబు, గురుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement