ముదిగొండ: స్వగ్రామం అభివృద్ధికి తన వంతు సాయంగా ఓ ఎన్‌ఆర్‌ఐ(ప్రవాస భారతీయుడు) ముందుకొచ్చాడు. ఈమేరకు ముదిగొండ వాసి వేగినాటి నాగభూషణం సోమవారం సర్పంచ్ కట్టకూరి ఉపేందర్‌కు రూ.లక్ష విరాళం చెక్కు అందజేశారు. ఆయన ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ఏర్పడగా, గ్రామాభివృద్ధికి అండగా నిలుస్తానన్న హామీతో రూ.లక్ష చెక్కు అందజేశారు. నూతన సర్పంచ్‌తో పాటు పాలకమండలి, యువకులు ఇటీవల కోతుల బెడదను నివారించేందుకు కృషి చేయడంతో పాటు గ్రామంలో అంతర్గత రహదారుల వెంట ముళ్ల పొదలను తొలగించారు. ఈనేపథ్యాన విరాళం అందజేసిన నాగభూషణంను స్థానికులు అభినందించారు.


