ఖమ్మం సహకార్ నగర్: మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సేకరణలో అవాంతరాలు ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన గోదాంల మేనేజర్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్ల ఇన్‌చార్జిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మిల్లర్లు సరఫరా చేసే బియ్యంను సకాలంలో దిగుమతి చేసుకునేలా హమాలీలను ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా మిల్లర్లు, వాహనదారులకు ఇబ్బంది ఉండదని తెలిపారు. అంతేకాక గోదాంలకు చేరిన బియ్యంను క్షుణ్ణంగా పరిశీలించి మిల్లర్లకు రశీదులు జారీ చేయాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి


