అత్యుత్తమ పత్రాల్లో మనకూ స్థానం
ఖమ్మం సహకారనగర్: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్ ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో వివిధ జిల్లాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈమేరకు వీరు పరిశోధనా పత్రాలు సమర్పించగా అత్యుత్తమైన ఐదింటిని ఎంపిక చేశారు. ఇందులో జిల్లాలోని వేంసూరు జెడ్పీహెచ్‌ఎస్ జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఆకూటి రాంబాబు సమర్పించిన పత్రానికి స్థానం దక్కింది. ‘శాసీ్త్రయ ధృక్పథం – విమర్శనాత్మక ఆలోచనను అభివృద్ధి చేయడం’ ప్రధాన అంశంగా ఆయన సైన్స్ అభ్యసనంలో అపోహలను తొలగించడంపై ప్రయోగాత్మక విశ్లేషణ సమర్పించారు. విద్యార్థుల్లో మూఢనమ్మకాలను తొలగించి, తార్కిక ఆలోచనలను ఎలా పెంపొందించవచ్చో వివరించగా రాంబాబుకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను డీఈఓ చైతన్య జైనీ, ఏఎంఓ పెసర ప్రభాకర్‌రెడ్డి, పాఠశాల హెచ్‌ఎం సుధాకరరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.


