టేకులపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ గోనెల విజయలక్ష్మి అంత్యక్రియలను ఆమె స్వగ్రా మం టేకులపల్లి మండలం తెలుగూరులో శుక్రవారం నిర్వహించారు. గుండెపోటు తో గురువారం ఆమె మృతి చెందగా మృతదేహాన్ని స్వ గ్రామానికి తీసుకొచ్చారు. తన రాజకీయ గురువైన వెంకటనారాయణ సతీ మణి మృతదేహంవద్ద ఇల్లెందు ఎమ్మెల్యేకోరం కనకయ్య నివాళులర్పించి కన్నీ టి పర్యంతమయ్యారు. అంతేకాక పాడె మోసి అంత్యక్రయల్లో పాల్గొన్నా రు. అలాగే, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, నాయకులు కోరం లక్ష్మి, కోరం సురేందర్, ఉమ, కోరం హన్మంతు, వెంకన్న, నర్సింగ్ లక్ష్మయ్య, కాలె ప్రసాద్, బండ్ల రజిని, శ్రీనివాస్, ఈది గణేశ్, జానీ తదితరులు నివాళులర్పించారు.
జెడ్పీ కార్యాలయంలో..
ఖమ్మం సహకారనగర్: ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గోనెల విజయలక్ష్మికి పలువురు నివాళులర్పించారు. ఖమ్మంలోని జెడ్పీ కార్యాలయంలో శుక్రవారం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించాక ఉద్యోగులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు రమణ, శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, జ్యోతి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.


