ఫిట్ ఇండియా అంబాసిడర్‌గా ఫర్హా
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం నగరానికి చెందిన మిసెస్ ఇండియా రన్నరప్ ఎంఏ ఫర్హాను కేంద్ర ప్రభుత్వ యూత్ ఎఫైర్స్, స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ ఫిట్ ఇండియా అంబాసిడర్‌గా నియమించింది. ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచటం, ప్రజలను ఆరోగ్యకరమైన, చురుకై న జీవనశైలిని అలవాటు చేసుకునేలా ప్రేరేపించటం లక్ష్యంగా ఫర్హాకు కేంద్రం ఈ బాధ్యతలను అప్పగించింది. ఆదివారం కేంద్రం అందించిన నియామకపు పత్రంపై ఫర్హా మాట్లాడుతూ.. జీవితంలో గర్వించదగిన బాధ్యతను ప్రభుత్వం తనకు కట్టబెట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ఫర్హాను పలువురు అభినందించారు.
సబ్ జూనియర్ వాలీబాల్ టోర్నీకి ఎంపిక
ఖమ్మంస్పోర్ట్స్: నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం వాలీబాల్ కోర్టులో శిక్షణ పొందుతున్న సయ్యద్ అర్షియా జాతీయస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికై ంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హూగ్లీలో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొననుంది. సయ్యద్ అర్షియా తండ్రి హోంగార్డుగా పనిచేస్తున్నారు. ఆమె ఎంపికపై డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
మహిళా ఉద్యోగుల
క్రీడా పోటీలు షురూ
ఖమ్మంస్పోర్ట్స్: తెలంగాణ నాలుగో తరగతి మహిళా ఉద్యోగుల క్రీడా పోటీలు ఆదివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి నాలుగో తరగతి ఉద్యోగి పదోన్నతి పొంది వృత్తిలో రాణించాలన్నారు. తొలు త ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి, టెన్నికాయిట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో గుంటుపల్లి శ్రీనివాసరావు, బుల్లెట్ శ్రీను, మోదుగు వేలాద్రి, కారుమంచి శ్రీనివాసరావు, జి.బిక్కు, ఓదె లు, ఎం.ఆజ్మీర్‌సింగ్, కాంపాటి వెంకటరమణ, కనకరావు, జానీ, రాంబాబులు పాల్గొన్నారు. అనంతరం నాలుగో తరగతి ఉద్యోగులను సన్మానించారు.
ఫిట్ ఇండియా అంబాసిడర్‌గా ఫర్హా
ఫిట్ ఇండియా అంబాసిడర్‌గా ఫర్హా


