పీసీసీఎఫ్‌ కార్యాలయంలో మన చిహ్నం! | - | Sakshi
Sakshi News home page

పీసీసీఎఫ్‌ కార్యాలయంలో మన చిహ్నం!

Mar 6 2026 8:15 AM | Updated on Mar 6 2026 8:15 AM

ఖమ్మంవ్యవసాయం: హైదరాబాద్‌లోని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌(పీసీసీఎఫ్‌) కార్యాలయంలో జిల్లాలోని పులిగుండాల ఎటో టూరియం నమూనాతో కూడిన చిహ్నం(లోగో) కొలువుదీరింది. రెండు నెమళ్ల ఆకృతులతో పాటు సహజ జలపాతంలా నీరు ప్రవహించే ఏర్పాటు చేసి విద్యుత్‌ లైట్లతో ఈ లోగో రూపొందించారు. దీన్ని గురువారం పీసీసీఎఫ్‌ డాక్టర్‌ సువర్ణకు జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌ హైదరాబాద్‌లో గురువారం అందజేయగా రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో సీసీఎఫ్‌లు ప్రియాంక వర్గీస్‌, డాక్టర్‌ భీమానాయక్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ మాట్లాడుతూ జిల్లాలో పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పులిగుండాల వద్ద సౌకర్యాలు కల్పించామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement