కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట

Mar 9 2026 7:33 AM | Updated on Mar 9 2026 7:33 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే మహిళా పక్షపాతి అని, ప్రభుత్వ పథకాలన్నింటినీ మహిళ పేరుపైనే అమలు చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్‌ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య అధ్యక్షతన ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో ప్రతీ పథకానికి మహిళ పేరు పెట్టి అమలు చేస్తున్నారని, రాష్ట్రంలోని మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తోందని తెలిపారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. అనంతరం మహిళలను సత్కరించారు. కాంగ్రెస్‌ ఖమ్మం కార్పొరేషన్‌ అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, మేయర్‌ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు రఫీదా బేగం, మిక్కిలినేని మంజుల, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి, అనుబంధ సంఘాల అధ్యక్షులు కొత్తా సీతారాములు, సయ్యద్‌ గౌస్‌, పుచ్చకాయల వీరభద్రం, గజ్జెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement