ఖమ్మం సహకారనగర్: తెలంగాణ రికగ్నైజ్‌డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ట్రస్మా) జిల్లా కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. ఖమ్మం బల్లేపల్లిలోని నిర్మల్ హైస్కూల్‌లో జరిగిన ఎన్నికల్లో ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా బీబీఎం స్కూల్ కరస్పాండెంట్ గుర్రం కాంతారావు, కార్యదర్శిగా నాయుడు వెంకటేశ్వరరావు, కోశాధికారిగా నాసరయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలు టాలెంట్ టెస్టుల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకరావటాన్ని అడ్డుకుంటామని తెలిపారు. రాష్ట్ర కమిటీ సహకారంతో జిల్లాలోని అన్ని బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు శిక్షణ అందేలా చూడడంతో పాటు బడ్జెట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడిచారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివరాత్రి యాదగిరి, వెంకటేశ్వరరావుతో పాటు యాదగిరి శేఖర్‌రావు, ఐవీ.రమణారావు, కే.సీ.వీరన్న, కొండపల్లి శశిధర్‌రెడ్డి, అజరుద్దీన్, ఇర్షాద్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
అధ్యక్ష, కార్యదర్శులుగా
కాంతారావు, వెంకటేశ్వరరావు


