రీజియన్‌లో అదనంగా 86 బస్సులు | - | Sakshi
Sakshi News home page

రీజియన్‌లో అదనంగా 86 బస్సులు

Mar 4 2026 7:51 AM | Updated on Mar 4 2026 7:51 AM

సత్తుపల్లిటౌన్‌: ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 86 కొత్త బస్సులు నడిపిస్తున్నామని రీజినల్‌ మేనేజర్‌ ఎ.సరిరాం తెలిపారు. సత్తుపల్లి డిపోను మంగళవారం తనిఖీ చేసిన ఆయన బస్సుల ఫిట్‌నెస్‌ను పరిశీలించడమే కాక బస్టాండ్‌లో సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆర్‌ఎం మాట్లాడుతూ మెరుగైన రవాణా కల్పించడమే లక్ష్యంగా అదనపు బస్సులు ఏర్పాటుచేశామని తెలి పారు. ఈ నేపథ్యాన ఆదాయం పెంచేలా ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. ఆతర్వాత భద్రతా వారోత్సవాల సందర్భంగా గ్యారేజీలో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. అలాగే, అద్దె బస్సుల యజమానులతో సమావేశమై సూచనలు చేశారు. డిపో మేనేజర్‌ జి.లక్ష్మీనారాయణ, ఉద్యోగులు ప్రవీణ్‌, సాహితి, శ్రీనివాస్‌, చక్రవర్తి, ఆనంద్‌ పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయం మూసివేత

ఎర్రుపాలెం: చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని మండలంలోని జమలాపురంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం మూసివేశారు. ఆలయంలో పూజలను ఉదయం 9గంటల లోపే పూర్తిచేసిన అనంతరం దర్శనాలు నిలిపివేసి ఆలయ ద్వారబంధనం చేశారు. కాగా, బుధవారం ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం 9గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఈఓ కె.జగన్మోహన్‌రావు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, వేద పండితులు విజయకృష్ణ, చక్రధర్‌, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.

వన్యప్రాణుల సంరక్షణ

అందరి బాధ్యత

జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌

ఖమ్మంవ్యవసాయం: పర్యావరణ సమతుల్యతలో కీలకమైన వన్యప్రాణుల సంరక్షణను అందరూ బాధ్యతగా భావించాలని జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌ సూచించారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లాలోని అన్ని రేంజ్‌ల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని డీఎఫ్‌ఓ తెలిపారు. వన్యప్రాణుల వేటతో అనర్థాలు, అడవుల నరికివేతతో ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించామని, వన్యప్రాణుల ఆవాసాల మెరుగుదల కోసం పలుచోట్ల మొక్కలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.

నేర పూరిత దాడి

మాస్‌లైన్‌ జాతీయ నాయకుడు

ప్రదీప్‌సింగ్‌ ఠాగూర్‌

ఇల్లెందు: అమెరికా, ఇజ్రాయిల్‌ కలిసి నేరపూరితంగా ఇరాన్‌పై సైనిక దాడులు నిర్వహిస్తున్నాయని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ అనుబంధ అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ నాయకుడు ప్రదీప్‌సింగ్‌ఠాగూర్‌ విమర్శంచారు. ఇల్లెందులో మంగళవారం జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. సైనికదాడులను వెంటనే నిలిపివేయాలన్నారు. కాగా, ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం శాంతి స్వావలంబనకు మద్దతుతెలపకుండా మౌనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వివిధ రాష్ట్రాల నాయకులు పరితోష్‌దాస్‌, సిబిగిరి, నిరంజన్‌ బేరా, దేవరావు, ఎస్‌కే.గౌస్‌, బి.రాము, గుమ్మడి నర్సయ్య, ముద్దా భిక్షం, నాగేశ్వరరావు, రాము, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement