ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
మధిర: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా వేయాలని అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు ఆదేశించారు. మధిర రూరల్ పోలీస్‌స్టేషన్‌ను శనివారం తనిఖీ చేసిన ఆయన ఫిర్యాదులు, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, చార్జీషీట్ల దాఖలుపై ఉద్యోగులతో సమీక్షించారు. అనంతరం అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ.. మధిర ఏపీకి సరిహద్దుగా ఉన్నందున ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించేలా చెక్ పోస్టుల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా చట్టప్రకారం జరిమానా విధించడమే కాక కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేయాలని సూచించారు.


