విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

Mar 1 2026 7:31 AM | Updated on Mar 1 2026 7:31 AM

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

కామేపల్లి: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. పొన్నేకల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో సరస్వతీ దేవీ విగ్రహా ఆవిష్కరణ, నూతన గ్రంథాలయ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు నాణ్యమైన విద్యే పునాది అని, క్రమ శిక్షణతో కూడిన బోధన, మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి ద్వారానే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం కోసం సహకరించిన దాతలను అభినందించాక మాలోత్‌ ప్రేమ్‌కుమార్‌ పదో తరగతి విద్యార్థులకు అందించిన పరీక్షా సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గుగులోత్‌ భూమిక, హెచ్‌ఎం కోటేశ్వరమ్మ, రాంరెడ్డి చరణ్‌రెడ్డి, టీటీఎఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మాలోత్‌ రామారావు, గింజల నర్సింహారెడ్డి, నల్లమోతు లక్ష్మయ్య, కోయడ శ్రీనివాస్‌, ఎస్సై శ్రీకాంత్‌, ఉపాధ్యాయులు భూక్యా టంక్‌, కమల్‌, మాలోత్‌ రవి, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement