ఫాసిస్టు విధానాలను ప్రతిఘటించండి | - | Sakshi
Sakshi News home page

ఫాసిస్టు విధానాలను ప్రతిఘటించండి

Mar 6 2026 8:15 AM | Updated on Mar 6 2026 8:15 AM

ఖమ్మం మామిళ్లగూడెం: కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న ఫాసిస్టు విధానాలను ప్రతిఘటించాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యురాలు టాన్యా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీకి వందేళ్లు నిండిన సందర్భంగా న్యూడెమోక్రసీ ఆధ్వర్యాన ఖమ్మంలో గురువారం జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు బి,భాస్కర్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నాయకులు పాల్గొని అమరులకు నివాళులర్పించారు. అనంతరం టాన్యా మాట్లాడుతూ దేశంలో పోలీసు రాజ్యం నడుస్తోందని.. కార్పొరేట్‌ శక్తులు, పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీలు పరుస్తున్నారని ఆరోపించారు. తక్కువ ధరతో కార్పొరేట్లకు భూములు కట్టబెడుతున్న పాలకులు.. మరోపక్క రైతాంగాన్ని దెబ్బతీసేలా చట్టాలు చేస్తున్నారని విమర్శించారు. నాయకుడు అశోక గాయల్‌ మాట్లాడగా ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర కమిటీల సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు ఆరెల్లి కృష్ణ, కె.విశ్వనాథ్‌, ప్రకాష్‌, కందగట్ల సురేందర్‌, రాంమూర్తి, సాంబ, సాయిలు, గనిరాజ్‌, దోంతోజ్‌ ఉపేందర్‌, యలమద్ది కళాధర్‌, కీలారి నాగేశ్వరావు, వెంకటరెడ్డి ప్రతాపరెడ్డి, చిట్టిబాబు, గనిరాజ్‌ చిట్టిబాబు, నున్నా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌డీ కేంద్ర కమిటీ సభ్యురాలు టాన్యా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement