తిరుమలాయపాలెం: మామిడి రైతులు తోటల్లో చీడపీడలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే నివారణ సులు వవుతుందని పాలేరు డివిజన్ ఉద్యాన శాఖాధికారి అపర్ణ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో మా మిడి తోటలను బుధవారం పరిశీలించిన ఆమె మా ట్లాడారు. పూత దశ నుంచి కాయలు వస్తున్నందున నల్ల మచ్చ తెగులు కనిపిస్తే కార్బండిజం ఒక గ్రాము లేదా కార్బండిజం, మ్యాంకోజెబ్ మందు రెండు గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. తేనెమంచు పురుగుఉధృతి ఉంటే ఇమి డాక్లోప్రిడ్ 0.3. మి.లీ. లేదా థయోమిథాక్సమ్ 0.4 గ్రా.ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని, పిందెలు ఎక్కువగా రాలితే ప్లానోఫిక్స్ 4.5 మి.లీ.ను 25 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని ఆమె తెలిపారు.


