ఇక్కడ హోలీ.. ప్రత్యేకం | - | Sakshi
Sakshi News home page

ఇక్కడ హోలీ.. ప్రత్యేకం

Mar 4 2026 7:52 AM | Updated on Mar 4 2026 7:52 AM

కూసుమంచి: ఎక్కడైనా హోలీ వేడుకలు ఒకే రోజు జరుపుకుంటారు. కానీ కూసుమంచి మండలం లోక్యాతండాలోమాత్రం మూడు రోజుల పాటు సందడి ఉంటుంది. ఈ మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు తండావాసులు నిర్వహిస్తుంటారు. ఈమేరకు మంగళవారం వేడుకలు కోలాటంతో ప్రారంభమయ్యాయి. తండా వాసులంతా గ్రామకూడలిలో చేరి సామూహికంగా కోలాటం ఆడుతూ పాటలతో సందడి చేశారు. ఇక రెండో రోజైన బుధవారం తెల్లవారుజామున తండా వాసులంతా కామదహనం నిర్వహిస్తారు. తండాలో గత హోలీ నుండి ఇప్పటి వరకు మగబిడ్డ పుట్టిన ఇంట డూండ్‌ వేడుకలు(అన్నప్రాసన, నామకరణం) మధ్యాహ్నం నిర్వమించనున్నారు. మూడో రోజు గురువారం తండావాసులు రంగులు చల్లుకుంటూ రంగేళీ నిర్వహించడంతో వేడుకలు ముగియనున్నాయి.

అంతా ఒక చోటకు...

మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగు వేడుకల్లో పాల్గొనేందుకు ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్న తండా వాసులంతా స్వస్థలానికి చేరారు. అంతేకాక ప్రతీ ఇంటికి బంధువులు కూడా రావడంతో తండాలో సండి నెలకొంది. ఈమేరకు పొట్టేళ్లను బలి ఇచ్చి విందులు ఏర్పాటు చేస్తుంటారు. కాగా, వేడుకల్లో తొలి రోజైన మంగళవారం తండావాసులంతా గ్రామ కూడలిలో చేరి కోలాటం మాడారు. చిన్నాపెద్ద తేడా లేకుండా కోలాటం ఆడగా.. పలువురు సంప్రదాయ తలపాగలు, పంచెకట్టుతో ఆకట్టుకున్నారు. తండా పెద్ద భేరీ మోగించి వేడుకలను ప్రారంభించాక పాటలు పాడుతూ అందుకు అనుగుణంగా కోలాటం ప్రదర్శించారు.

లోక్యాతండాలో ప్రారంభమైన

మూడు రోజుల వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement