పిచ్చికుక్క స్వైరవిహారం | - | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క స్వైరవిహారం

Mar 1 2026 7:31 AM | Updated on Mar 1 2026 7:31 AM

పిచ్చ

పిచ్చికుక్క స్వైరవిహారం

నేలకొండపల్లి: మండలంలోని ముజ్జుగూడెంలో శనివారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. స్థానికులపైకి దూసుకొచ్చిన కుక్క వారు పరుగులు తీసినా వెంట పడి కరిచింది. ఈ ఘటనలో బి.వెంకటేశ్వర్లు, అక్బర్‌, బుర్రయ్య, అక్షయ్‌కుమార్‌, జాహిద్‌, ఎస్‌కే రెహాన్‌, వీరయ్య, యాదయ్య తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆపై ఆచార్లగూడెం వైపు వెళ్లిన కుక్కను స్థానిక యువత వెంబడించి హతమార్చటంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. కాగా, గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, తీవ్ర గాయాలైన వీరయ్యను ఖమ్మం తరలించారు. ఈమేరకు డీఎంహెచ్‌ఓ రామారావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కె.రాజశేఖర్‌, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, డీఎల్‌పీఓ తదితరులు ఆస్పత్రికి వచ్చి వైద్యసేవలపై ఆరా తీశారు. అలాగే, ముజ్జుగూడెం వెళ్లి కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని పాలకవర్గాలకు సూచించారు. ఎంపీడీఓ ఎం.యర్రయ్య, వైద్యాధికారి మంగళ, సర్పంచ్‌లు శీలం వెంకటలక్ష్మి, కొలికపొంగు ఉప్పలమ్మ, బొడ్డు వసంత, కార్యదర్శులు పాల్గొన్నారు.

ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

పిచ్చికుక్క స్వైరవిహారం1
1/1

పిచ్చికుక్క స్వైరవిహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement