ప్రశ్నలు వేసి జవాబులు రాబడుతూ.. | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నలు వేసి జవాబులు రాబడుతూ..

Feb 27 2026 4:19 AM | Updated on Feb 27 2026 4:19 AM

ప్రశ్

ప్రశ్నలు వేసి జవాబులు రాబడుతూ..

ఉపాధ్యాయురాలిగా మారిన

జెడ్పీ సీఈఓ దీక్ష!

నేలకొండపల్లి: విద్యార్థులను ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టడమే కాక వారి సందేహాలు తీర్చిన జెడ్పీ సీఈఓ దీక్షారైనా కాసేపు ఉపాధ్యాయురాలి పాత్ర పోషించారు. మండలంలో గురువారం పర్యటించిన ఆమె చెరువుమాధారం, రాజేశ్వరపురం ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. తొలుత ఉపాధ్యాయులతో సమావేశమై ఈసీఆర్‌ ప్రగతిపై ఆరా తీశారు. ఈక్రమాన చెరువుమాధారం పాఠశాలలో విద్యార్థుల ప్రగతిని తెలుసుకునేందుకు టీచర్‌గా మారారు. బోర్డుపై అక్షరాలు, పదాలు రాసి చదివించారు. సమాధానాలు చెప్పిన వారికి చాక్లెట్లు ఇచ్చి ప్రోత్సహించారు. ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంఈఓ బి.చలపతిరావు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కుష్ఠు నిర్మూలనే

లక్ష్యం కావాలి

ఖమ్మంవైద్యవిభాగం: కుష్ఠు బాధితులకు వైద్యసేవలు అందిస్తూ జిల్లా నుంచి వ్యాధిని పూర్తిగా తరిమికొట్టడమే ఉద్యోగుల లక్ష్యం కావాలని అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ చందునాయక్‌ అన్నారు. జిల్లాలోని పీహెచ్‌సీల లెప్రసీ విభాగం డీపీఎంఓలు, ఎంపీఎంఓల సమావేశం లెప్రసీ పారా మెడికల్‌ ఆఫీసర్‌ బి.భోజ ఆధ్వర్యాన గురువారం జరిగింది. ఈ సమావేశంలో చందునాయక్‌ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన సర్వేలో గుర్తించిన అనుమానితులకు చికిత్స మొదలుపెట్టాలని తెలిపారు. డిప్యూటీ పారా మెడికల్‌ ఆఫీసర్లు ప్రతీనెల ఆశా డే సమావేశమై హాజరై వ్యాధిపై అవగాహన కల్పించాలని, ఆరు నెలల చికిత్స పూర్తయిన వారిని కొద్దినెలల తర్వాత పరీక్షించాలని చెప్పారు. అంతేకాక కొత్త కేసు నమోదైనప్పుడు వారి ఇంటి చుట్టుపక్కల 300 ఇళ్ల వరకు పరిశీలించాలని సూచించారు. డీపీఎంఓ అఫ్జల్‌మియా, జి.భద్రు, కె.వెంకట్‌, దూప్‌సింగ్‌ పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగు

లాభదాయకం

రఘునాథపాలెం/తిరుమలాయపాలెం: వరుసగా పత్తి, మిర్చి, వరి సాగు చేసే రైతులు ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి సారించాలని, తద్వారా దీర్ఘకాలం లాభాలు ఉంటాయని జిల్లా ఉద్యాన అధికారి మధుసూదన్‌ తెలిపారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తి, తిరుమలాయపాలెంలో గురువారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ఆయిల్‌పామ్‌ ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు ఆదాయం ఇవ్వడమే కాక ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటుందని తెలిపారు. అంతేకాక ప్రభుత్వం నుంచి ఎకరాకు రూ.51వేల రాయితీ అందుతుందని చెప్పారు. అశ్వారావుపేట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు శ్రీనివాస్‌, సుబ్బారావు ఆయిల్‌పామ్‌ సాగు, ఎరువుల యాజమాన్యంపై వివరించారు. చింతగుర్తి సర్పంచ్‌ మౌనిక, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు నగేష్‌, సతీష్‌, విజయలక్ష్మి, జరీనా, గోద్రెజ్‌ మేనేజర్‌ రామకృష్ణ, సర్పంచ్‌ డి.సుజాత, రైతులు కేతినేని సీతారాములు, కొండపల్లి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రశ్నలు వేసి  జవాబులు రాబడుతూ..
1
1/2

ప్రశ్నలు వేసి జవాబులు రాబడుతూ..

ప్రశ్నలు వేసి  జవాబులు రాబడుతూ..
2
2/2

ప్రశ్నలు వేసి జవాబులు రాబడుతూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement