భద్రాద్రి కలెక్టర్‌గా అంకిత్‌ | - | Sakshi
Sakshi News home page

భద్రాద్రి కలెక్టర్‌గా అంకిత్‌

Feb 27 2026 4:19 AM | Updated on Feb 27 2026 4:19 AM

భద్రాద్రి కలెక్టర్‌గా అంకిత్‌

భద్రాద్రి కలెక్టర్‌గా అంకిత్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా అంకిత్‌ సక్సేనా గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలంగాణ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ సీఎండీగా నియమితులయ్యారు. ఈమేరకు అంకిత్‌ సక్సేనా జిల్లాకు రాగా, పాటిల్‌తో పాటు అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌ స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించాక ఆయన వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రస్తుత కలెక్టర్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

నిజామాబాద్‌లో అదనపు కలెక్టర్‌గా..

2019 తెలంగాణ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన అంకిత్‌ సక్సేనా సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మొదట ఐఐటీ నుంచి ఇంజనీరింగ్‌ పట్టా పొందడమే కాక టాపర్‌గా నిలిచారు. ఐఏఎస్‌గా ఎంపికయ్యాక శిక్షణ అనంతరం వివిధ జిల్లాలో సహాయ కలెక్టర్‌గా, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం నిజామాబాద్‌ అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వర్తి స్తూ భద్రాద్రి కలెక్టర్‌గా నియమితులయ్యారు.

టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీగా బదిలీ అయిన పాటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement